పనితీరు మెరుగుపడాలి | - | Sakshi
Sakshi News home page

పనితీరు మెరుగుపడాలి

Nov 6 2026 11:48 PM | Updated on Nov 6 2026 11:48 PM

● తాగునీటి సరఫరాకు ప్రాధాన్యమివ్వాలి ● వీసీలో సీఎస్‌ సంజయ్‌ జాజు

● తాగునీటి సరఫరాకు ప్రాధాన్యమివ్వాలి ● వీసీలో సీఎస్‌ సంజయ్‌ జాజు

కై లాస్‌నగర్‌: ప్రభుత్వ లక్ష్యాల సాధనలో పనితీరు మెరుగుపడాలని, విద్య, తాగునీటి సరఫరా, వీబీజీ రాంజీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పలు సూచనలు చేశారు. పీఎం శ్రీ నిధులు వినియోగిస్తూ విద్యాసంస్థల్లో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ఇతర మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. వేసవి ముగిసే వరకు తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యమివ్వాలన్నారు. తాగునీటి కమిటీల ఏర్పాటుతో పాటు ప్రతీ వారం సమావేశమై పరిస్థితిని సమీక్షించాలన్నారు. ఈనెల 15లోపు చేతిపంపులు, బోర్లు, బహిరంగ బావులు తదితర తాగునీటి మౌలిక సదుపాయాలకు అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. 15 నుంచి డిసెంబర్‌ 31వరకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అర్హులకు చేరువ చేయాలన్నారు. ఇందులో కలెక్టర్‌ రాజర్షిషా, అదనపు కలెక్టర్లు రాజేశ్వర్‌, చిత్రు, ఆర్డీవో జగదీశ్వర్‌రావు, జెడ్పీ సీఈవో రవి, డీఆర్డీవో రవీందర్‌ రాథోడ్‌, డీఈవో మాధవి, హౌసింగ్‌ పీడీ శంకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement