ముగిసిన ట్రెయినీ అధికారుల పర్యటన | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ట్రెయినీ అధికారుల పర్యటన

Nov 6 2026 11:48 PM | Updated on Nov 6 2026 11:48 PM

కై లాస్‌నగర్‌: జిల్లాలో ఆరు రోజుల పాటు కొనసాగి న సివిల్‌ సర్వీసెస్‌ ట్రెయినీ అధికారుల క్షేత్రస్థాయి పర్యటన శుక్రవారంతో ముగిసింది. 18మంది మూడు బృందాలుగా ఏర్పడి నేరడిగొండ మండలంలోని కుమారీ, తాంసి మండలంలోని బండల్‌నాగాపూర్‌, తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. వీరంతా గురువారం ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో పర్యటించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేశారు. విద్య, వైద్యం, ఉపాధి, ఆసుపత్రులు, ఐసీ డీఎస్‌ ద్వారా అందిస్తున్న సేవలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ సేవల అమలుపై ఆరా తీశారు. కాగా, కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం ముగింపు సమావేశం నిర్వహించారు. శిక్షణలో భాగంగా వారు అధ్యయనం చేసిన అంశాలను కలెక్టర్‌కు వివరించారు. ఇది భవిష్యత్తులో సమర్థవంతమైన, పారదర్శకమైన పాలన అందించేందుకు దోహదపడుతుందని కలెక్టర్‌ వారితో పేర్కొన్నారు.ఇందులో అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, డీఆర్డీవో రవీందర్‌ రాథోడ్‌, డీఈవో మాధవి, శిశు సంక్షేమ శాఖ అధికారి మిల్కా, ఎంసీహెచ్‌ఆర్‌డీ కోఆర్డినేటర్‌ రాజలింగు తదితరులు పాలొన్నారు.

కలెక్టర్‌కు ఆహ్వాన పత్రం అందజేత

ఆదిలాబాద్‌ పట్టణ శివారులో నిర్మించిన ఐటీ టవర్‌ను ఈ నెల 9న రాష్ట్ర ఐటీ, పరిశ్రమ ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో టీజీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ శివప్రసాద్‌ శుక్రవారం కలెక్టర్‌ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు.

సెలవుపై కలెక్టర్‌..

కలెక్టర్‌ రాజర్షిషా వ్యక్తిగత సెలవుపై వెళ్లా రు. దీపావళి పురస్కరించుకొని తన సొంత రాష్ట్రమైన రాజస్థాన్‌కు కుటుంబ సభ్యులతో గడిపేందుకు శుక్రవారం బయల్దేరి వెళ్లారు. ఈనెల 12వరకు ఆయన సెలవులో ఉండనున్నట్లుగా కలెక్టరేట్‌ వర్గాలు తెలి పాయి. తిరిగి 13న విధుల్లో చేరనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement