కై లాస్‌నగర్: చనాఖా–కొరటా బ్యారేజ్ నిర్మాణంలో రూ.1700 కోట్ల అవినీతి జరిగిందని తన సోదరి కవిత చేసిన విమర్శలకు సమాధానం చెప్పలేని కేటీఆర్ కాంగ్రెస్‌ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్ ఆరోపించారు. వారు చేసిన అవినీతిపై ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వాన్ని విమర్శించారని అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన తప్పిదాలకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాధ్యులను చేయాలని చూస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటన్నారు. ఈనెల 9న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చేతుల మీదుగా జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మించిన ఐటీటవర్‌ను ప్రారంభించనున్నట్లుగా పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


