చెత్త తెచ్చి.. కార్యాలయం ఎదుట పోసి | - | Sakshi
Sakshi News home page

చెత్త తెచ్చి.. కార్యాలయం ఎదుట పోసి

Nov 6 2026 11:48 PM | Updated on Nov 6 2026 11:48 PM

● మున్సిపల్‌ కౌన్సిలర్‌ వినూత్న నిరసన

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ మున్సిపల్‌లో చెత్త సేకరణ తీరు సరిగా లేదంటూ అధికార పార్టీకి చెందిన 26వ వార్డు కౌన్సిలర్‌ జీషాన్‌ అలీ వినూత్నరీతిలో నిరసన తెలిపాడు. ఎనిమిది రోజులుగా ఆ వార్డుకు చెత్త సేకరణ వాహనాలు రాకపోవడంతో ఇళ్లలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. కాలనీవాసులు విషయాన్ని కౌన్సిలర్‌ దృష్టికి తీసుకురాగా ఆయ న సంబంధిత అధికారులు, కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లాడు. స్పందన లేకపోవడంతో ప్రత్యేకంగా ఓ ట్రాలీ మాట్లాడి స్వయంగా కాలనీలో ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించారు. మున్సిపల్‌ కార్యాలయానికి తీసుకువచ్చి ప్రధాన ద్వారం వద్ద కుప్పగా పోసి నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో వచ్చిన కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌ ఆయనకు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా కాలనీలో పారిశుద్ధ్య ని ర్వహణపై కౌన్సిలర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముగ్గురిపై చర్యలు

ఈమేరకు బాధ్యులపై అధికారులు చర్యలు చేపట్టా రు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌కు చార్జీ మెమో జారీ చేయగా, పర్యవేక్షణలో అలసత్వం ప్రదర్శించిన జవాన్‌ శాంసన్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. ఒకే ట్రిప్పు చెత్త సేకరించి ట్రాక్టర్‌ను త్వరగా పా ర్కింగ్‌ స్థలంలో పెట్టిన ౖడ్రైవర్‌ మోసిన్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లుగా కమిషనర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement