ఆదిలాబాద్‌టౌన్: పేదలకు న్యాయ సేవాధికార సంస్థ అండగా ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి ప్రభాకర్‌రావు పేర్కొన్నా రు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సదన్‌లో గురు వారం జాతీయ న్యాయ సేవాధికార దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడు తూ.. మహిళలు, పిల్లలు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు, పారిశ్రామిక కార్మికులు, విపత్తుల బాధితులు, నిర్దిష్ట ఆదాయ పరిమితిలో ఉన్నవారు ఉచిత న్యా య సహాయం పొందేందుకు అర్హులని, సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి హుస్సేన్, జడ్జిలు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, ప్యానెల్ న్యాయవాదులున్నారు.


