బోథ్: పార్డి (కె)లో నృత్యం చేస్తున్న ఆదివాసీలు
ఇంద్రవెల్లి: ఓల్మద్రిలో ఎత్మసూర్ దేవతలకు పూజలు చేస్తున్న ఆదివాసీలు
ఇంద్రవెల్లి: కన్నాపూర్‌లో సంప్రదాయ నృత్యం చేస్తున్న ఆదివాసీలు
ఇంద్రవెల్లి/బోథ్/సిరికొండ: దండారీ ఉత్సవాల ను ఆదివాసీలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఇంద్రవెల్లి మండలంలోని సాలేగూడ దండారీ బృందం ఓల్మద్రికి, వాల్గొండ బృందం తుమ్మగూడకు, పొల్లుగూడ బృందం బెల్లురికి, డొంగర్‌గామ్ బృందం కన్నాపూర్‌కు, గట్టెపల్లి బృందం టెకిడిగూడ గ్రామానికి అతిథులుగా వెళ్లగా ఆయా గ్రామాల ఆదివాసీలు ఘనస్వాగతం పలికి మర్యాద చేశా రు. ఎత్మసూర్ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. అతిథులుగా వచ్చిన దండారీ బృందం యువకులు చేసిన సంప్రదాయ గుస్సాడీ నృత్యం, ప్రదర్శించిన నాటికలు ఆకట్టుకున్నాయి. అలాగే, సొనాల మండలంలోని పార్డి (కె) గ్రామానికి మహారాష్ట్రలోని పాటొ దా, మార్కగూడ, దండారీ నుంచి వచ్చిన దండారీ బృందాలకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. గుస్సాడీ వేషధారణలతోవారు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. సిరికొండ మండలంలోని రిమ్మ గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో మంద మకరందు, ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ రిత్విక్ సాయి పాల్గొన్నారు. గుస్సాడీలకు ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించి గిరిజనులతో కలిసి నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని తెలిపారు. వీటిని భావితరాలకు అందించడం మన బాధ్యత అని పేర్కొన్నారు. వారి వెంట తహసీల్దార్ అరవింద్, ఎంపీడీవో రఘువీర్‌రెడ్డి, ఎంపీవో సంతోష్‌కుమార్, గ్రామ పటేల్ శంకర్, సర్పంచ్ పెందుర్ జంగుబాయి, మాజీ సర్పంచ్ పెందుర్ అనిల్‌కుమార్ తదితరులున్నారు.


