ఆదిలాబాద్‌టౌన్: ప్రతీ విద్యార్థిలో ఆత్మవిశ్వా సం పెంచడమే లక్ష్యమని కలెక్టర్ రాజర్షిషా పే ర్కొన్నారు. పట్టణంలోని డైట్ కళాశాల వసతిగృహ ఆవరణలోగల మావల కేజీబీవీలో గురువా రం ఇన్‌స్పైర్ అండ్ ఇగ్నైట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యక్తిత్వ వికాస శిక్షణకు హాజరై మాట్లాడారు. విద్యతో పాటు మానవతా విలువలు, క్రమశిక్షణ, మంచి ఆలోచనా విధానాన్ని అ లవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. జీ విత లక్ష్య నిర్దేశం, స్టేజ్ ఫియర్‌ను అధిగమించ డం, సానుకూల ఆలోచనా విధానం, జ్ఞాపకశక్తి ని పెంచే మెళకువలపై అవగాహన కల్పించారు. కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించేందుకు సహకారం అందిస్తున్న లక్ష్మారెడ్డిని కలెక్టర్ అభినందించారు. డీఈవో మాధవి, డీఎంహెచ్‌వో సాధన, ఎస్వో సువర్ణ, ఫౌండేషన్ డైరెక్టర్లు రంజిత్, రాము, సుధాకర్, మోటివేషన్ స్పీకర్ వై.సురేంద్ర, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో రాణించేందుకే ఉన్నతి విద్య
విద్యార్థుల్లో విద్యా నైపుణ్యాలు పెంచి, వారిని అ న్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దేందుకే ‘ఉన్న తి విద్య’ దోహద పడుతుందని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. జిల్లా కేంద్రంలోని బాలక్ మందిర్ పీఎంశ్రీ పాఠశాలలో ఉన్నతి విద్యను ప్రారంభి చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఉన్నతికి బాట.. విద్యతో ప్రయాణం–అభ్యాస నం, అభివృద్ధి, విజయం.. అనే లక్ష్యంతో చేపట్టి న ఈ కార్యక్రమం విద్యార్థుల భవిష్యత్‌కు దిశానిర్దేశం చేస్తుందని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో తమ ల క్ష్యాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మా ట్లాడారు. ప్రశ్నలు అడిగి వారి అభ్యసన స్థామర్థ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి మాధవి, సెక్టోరల్ అధికారి లక్ష్మణ్, ప్రధానోపాధ్యాయు డు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అధికారులతో సమీక్ష
కైలాస్‌నగర్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో తాగునీటి సరఫరా, మిషన్ భగీరథ, ఉపాధిహామీ, ఇందిరమ్మ ఇళ్లు, విద్యుత్ ఆదా, ఉద్యోగుల హాజరు, అంగన్‌వాడీ భవనాలు, గ్రామపంచాయతీ భవనాల నిర్మా ణం తదితర అంశాలపై కలెక్టర్ రాజర్షిషా సమీ క్షించారు. ఈ నెల 15నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి గ్రామాల్లో నీటి వనరులు, మోటార్లు, పైప్‌లైన్ లీకేజీలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని, ఉపాధిహామీ పనులను వేగవంతం చేయాలని, ఫామ్‌పాండ్స్, ఇంకుడు గుంతలు, బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు, పశువుల నీటి తొట్ల పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులంతా ‘మీ ప్రమాణం’ మొబైల్ యాప్ ద్వారా ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. జెడ్పీ సీఈవో రవి, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ సుభాష్, జిల్లా సంక్షేమాధికారి మిల్కా, మిషన్ భగీరథ ఎస్‌ఈ శ్రవణ్‌కుమార్, హౌసింగ్ పీడీ శంకర్, భూగర్భజల శాఖ ఏడీ సతీశ్‌కుమార్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రామారావు, డీపీవో రమేశ్, పీఆర్ ఈఈ శివరామ్, గిరిజన సంక్షేమశాఖ ఈఈ తనాజీ, వివిధ మండలాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


