జిల్లాకు 18 మంది సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు 18 మంది సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు

Nov 1 2026 12:21 AM | Updated on Nov 1 2026 12:21 AM

● ఈ నెల 6వరకు మూడు బృందాలుగా క్షేత్రస్థాయి పరిశీలన

కై లాస్‌నగర్‌: ఆలిండియా సర్వీసెస్‌, సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌కు సంబంధించి 18 మంది ట్రెయినీ అధికారులు శనివారం జిల్లాకు చేరుకున్నారు. కలెక్టర్‌ రాజర్షి షా, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌తో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. వారికి జిల్లాకు సంబంధించిన సమాచారం, ప్రగతి వివరాలను తెలిపిన అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయానికి అవసరమైన నివేదికలు అందజేశారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న స్పెషల్‌ ఫౌండేషన్‌ కోర్స్‌లో భాగంగా అక్టోబర్‌ 31 నుంచి ఈనెల 7వరకు క్షేత్రస్థాయిలో వివిధ అంశాలపై పరిశీలన చేయనున్నారు. అనంతరం ఒక్కో బృందంలో ఆరుగురు చొప్పున, మూడు బృందాలుగా ఎంపిక చేసి అధ్యయనం చేసే గ్రామాలను కేటాయించారు. నేరడిగొండ మండలం కుమారి, తలమడుగు మండలం సుంకిడి, తాంసి మండలం బండాల్‌ నాగపూర్‌ గ్రామాల్లో ఈ నెల 4వరకు క్షేత్రస్థాయిలో వీరు పర్యటించనున్నారు. కాగా వీరంతా ఆయా గ్రామాలకు చేరుకున్నారు. నేటి నుంచి పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. 5వ తేదీన ఆదిలాబాద్‌కు చేరుకుని 6వ తేదీ వరకు ఆదిలా బా ద్‌ మున్సిపల్‌ పరిధిలోని 38వ వార్డు కై లాస్‌నగర్‌లో పట్టణాభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించనున్నా రు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎస్‌.రాజేశ్వర్‌, డీఆర్డీవో రాథోడ్‌ రవీందర్‌, ఎంసీహెచ్‌ఆర్‌డీ పర్యవేక్షకులు రాజలింగు, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కుమారి గ్రామానికి చేరుకున్న శిక్షణ

అధికారుల బృందం

నేరడిగొండ: మండల పరిధిలోని కుమారి గ్రామానికి శిక్షణాధికారుల బృందం సాయంత్రం చేరుకుంది. వారికి గ్రామస్తులు స్వాగతం పలికారు. ఎంపీడీవో గంగసాగర్‌రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్‌ గోదావరి లస్మన్న, ఉప సర్పంచ్‌ రవి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో శిక్షణాధికారులు మనీషా నహోరా, ప్రద్యుమన్‌ సింగ్‌ బిట్టు, అక్షయ్‌ కుమార్‌శర్మ, అనురాగ్‌ విమల్‌ వర్మ , మోహిత్‌ అగర్వాల్‌ పాల్గొన్నా రు. గ్రామం వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట డీపీఎం కే. వెంకటసాయి ప్రసాద్‌, ఏపీఎం జి. వెంకట్‌రెడ్డి, ఏఈవో స్రవంతి, పంచాయతీ కార్యదర్శి దత్తహరి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement