కై లాస్‌నగర్: దేశ సమగ్రత, సమైక్యత, ప్రజా స్వామ్య పరిరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకురాలు మాజీ ప్రధా ని ఇందిరాగాంధీ అని డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్ కొనియాడారు. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఢిలీలోని ఇందిరాభవన్‌లో జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రధానిగా ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఇందులో మార్కె ట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, సాజిద్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.


