ఆదిలాబాద్‌టౌన్: బీఆర్‌ఎస్ తలపెట్టిన రైతు గర్జనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాన్ని నీలదీసేందు కోసం ఆదిలాబాద్ వేదికగా ఆ పార్టీ పోరాటానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాల మైదానంలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లను మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు ఇటీవల కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన డీసీసీ మాజీ అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండే తదితరులు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. సభ ప్రాధాన్యత చాటిచెప్పేలా పట్టణాన్ని పూర్తిగా గులాబీమయం చేశారు. సభ ప్రాంగణంతో పాటు ఎన్టీఆర్ చౌక్ నుంచి వినాయక్‌చౌక్ వరకు, కలెక్టర్‌చౌక్ నుంచి మావల బైపాస్ రహదారి వరకు డివైడర్లపై గులాబీజెండాలు, పార్టీ నేతల ఫ్లెక్సీలు, భారీ కటౌట్లు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. ఆదివా రం సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించనున్న ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజ రుకానున్నారు. ఆయనతో పాటు పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారని పార్టీ నేతలు తెలిపారు. కేటీఆర్ మధ్యాహ్నం 3గంటలకు నేరడిగొండకు చేరుకోనున్నారు. ఎమ్మెల్యే అనిల్ జాద వ్ స్వాగతం పలుకనున్నారు. సాయంత్రం జిల్లా కేంద్రానికి చేరుకున్న తర్వాత ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన తలమడుగులోని రైతు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. సాయంత్రం 6గంటలకు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
భారీగా జన సమీకరణ..
ప్రభుత్వతీరును ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్ పార్టీ ఈ సభ ద్వారా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 20వేల మందిని సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లా నుంచి రైతులు, వివిధ వర్గాల ప్రజలను సభకు తరలించేలా ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జీలకు బాధ్యతలు అప్పగించారు. వారం నుంచే ఈప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నాలుగు రోజు లుగా జిల్లా కేంద్రంలోనే ఉంటూ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇటీవల పార్టీలో చేరిన భార్గవ్ దేశ్‌పాండే తన అనుచరులను పార్టీలో చేర్పించనున్నట్లు తెలుస్తోంది.
డైట్ మెదానంలో సిద్ధమైన సభ ప్రాంగణం రైతుగర్జన సభ ముఖద్వారం


