జిల్లాలో 94923 41947 నంబర్ అందుబాటులోకి.. ఫిర్యాదుల సత్వర పరిష్కారమే లక్ష్యంగా.. అధికారులతో సమీక్షించిన కలెక్టర్ రాజర్షిషా
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. వేకువజామున గాలులు వీస్తాయి. గాలిలో తేమశాతం పెరగనుంది.
కై లాస్‌నగర్: ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరించి, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రీవెన్స్ సెల్‌ను జిల్లావాసులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ప్రజలు తమ సమస్యలు, ప్రభుత్వ సేవల్లో జాప్యం, ఇతర ఫిర్యాదులను 94923 41947 వాట్సాప్ నంబర్‌కు పంపవచ్చని తెలిపారు. ఈ నంబర్ ద్వారా అందిన ఫిర్యాదులు, వాటి పరిష్కార పురోగతిపై శనివారం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ, ప్రతీ ఫిర్యాదును ప్రాధాన్యతతో స్వీకరించాలన్నారు. వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజల కు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులు లేకుండా, సులభమైన విధానంలో తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు వాట్సాప్ గ్రీవెన్స్ సెల్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. అధికా రులు సమన్వయంతో పనిచేస్తూ బాధితులకు వేగంగా, పారదర్శకంగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. సమావేశంలో ఉట్నూర్ సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్, డీఆర్వో స్రవంతి తదతరులు పాల్గొన్నారు.
గుడ్ల సరఫరా టెండర్లు ఖరారు
జిల్లాలోని ప్రభుత్వ వివిధ సంక్షేమ వసతి గృహాల్లో గుడ్ల సరఫరాకు సంబంధించి టెండర్ ప్రక్రియను శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా ఎస్సీ సంక్షేమ అభివృద్ధి అధి కారి సునీత కుమారి, గిరిజన సంక్షేమ శాఖ డీడీ అశోక్, బీసీ సంక్షేమ అధికారి సోనియా, పశు సంవర్ధకశాఖ అధికారి రామారావు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


