దర్యాప్తులో నాణ్యత పాటించాలి | - | Sakshi
Sakshi News home page

దర్యాప్తులో నాణ్యత పాటించాలి

Nov 1 2026 12:21 AM | Updated on Nov 1 2026 12:21 AM

● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: కేసుల దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు పాటించి నేరస్తులకు చట్టప్రకారం శిక్షలు పడేలా విధులు నిర్వర్తించాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ సమావేశ మందిరంలో స్టేషన్‌ అధికారులు, సిబ్బందికి శనివారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతీ కేసును ప్రాధాన్యతతో తీసుకొని, నేరం జరిగిన తీరు, నిందితుల పాత్ర, సంబంధిత సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగించాలన్నారు. నేరస్తులకు శిక్షలు పడినప్పుడే బాధితులకు సరైన న్యాయం జరగడంతో పాటు ప్రజల్లో పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎల్‌. జీవన్‌రెడ్డి, లీగల్‌ అడ్వైజర్‌ సురేందర్‌, పట్టణ సీఐలు సునీల్‌ కుమార్‌, నాగరాజు, రహీం పాషా, ప్రణయ్‌కుమార్‌, ఎస్సై విష్ణువర్ధన్‌, పోలీస్‌ అధికారులు, స్టేషన్‌ రైటర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement