హాకీలో కింగు.. మన జంగు | - | Sakshi
Sakshi News home page

హాకీలో కింగు.. మన జంగు

Nov 1 2026 12:21 AM | Updated on Nov 1 2026 12:21 AM

ఇంద్రవెల్లి మండలం చిలేటిగూడ గ్రామానికి చెందిన ఉర్వేత జంగు హాకీలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ముందుకు సాగుతున్నాడు. వ్యవసాయ కుటుంబానికి చెందినప్పటికీ క్రీడపై ఆసక్తి, పట్టుదలతో ఇప్పటివరకు ఏడు పతకా లు సాధించాడు. నాలుగు స్వర్ణాలు, మూడు కాంస్య పతకాలను తన ఖాతాలో వేసుకున్నాడు. లింగు–సీతాబాయి దంపతుల కుమారుడైన జంగు ప్రస్తుతం ఉట్నూరు గిరిజన క్రీడా ఆదర్శ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. హాకీలో రైట్‌ బ్యాక్‌ పొజిషన్‌లో ఆడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషి స్తున్నాడు. అండర్‌–14 విభాగంలో మధ్యప్రదేశ్‌లో జరిగిన ఎస్‌జీఎఫ్‌ జాతీయస్థాయి పో టీల్లో పాల్గొన్నాడు. తాజాగా జార్ఖండ్‌ వేదికగా నిర్వహించనున్న అండర్‌–17 ఎస్‌జీఎఫ్‌ పోటీలకు సైతం ఎంపికయ్యాడు. భవిష్యత్తులో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే తన లక్ష్యమని, ఇందుకోసం నిరంతరం శ్రమిస్తున్నానని జంగు చెబుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement