ఆదిలాబాద్‌టౌన్:జిల్లాలోని కొరటా–చనాఖా ప్రాజె క్టు గురించి వాస్తవాలు తెలియకుండా టీఆర్‌ఎస్ అధినేత్రి కవిత విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఇంద్రవెల్లి సభలో ఆమె తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శించడాన్ని ఆయన తప్పుపట్టారు. శనివారం పార్టీ కా ర్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన కవి త వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. బీఆర్‌ఎస్ హయంలో 2015లో జీవో 120 ప్రకారం రూ. 1,220 కోట్లు మంజూరు చేశామన్నారు. 2025లో అది కాస్తా రూ.1,590 కోట్లకు చేరిందన్నారు. తమ హయంలో పూర్తి ప్రాజెక్టు వ్యయం రూ.1300 కోట్లు కూడా దాటలేదన్నారు. కానీ కవిత మాత్రం రూ. 1700 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించడం శో చనీయమన్నారు. అలాగే సీసీఐ పునరుద్ధరణ విషయంలో తాము అధికా రంలో ఉన్నప్పుడు ప లుమార్లు కేంద్రానికి లేఖలు రాశామని, టీ ఎస్ ఐపాస్ కింద నూతన పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు ఇస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పునరుద్ధరిస్తామని ప్రతిపాదనలు పంపినా కేంద్రం నుంచి స్పందన రాలేదన్నారు. దీనిపై తాము ఎక్కడైనా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
బీఆర్‌ఎస్‌లో చేరిక ..
కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలువురు నాయకులు రామన్న సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇందులో కాంగ్రెస్ నాయకులు గంగారెడ్డి, బీజేపీ నాయకులు కిష్టన్న, సురేష్ తదితరులున్నారు.


