పంట నష్టం గణన | - | Sakshi
Sakshi News home page

పంట నష్టం గణన

Oct 31 2026 8:31 AM | Updated on Oct 31 2026 8:31 AM

● 33 శాతం పైబడితేనే పరిగణలోకి.. ● ఆ రైతులకే ఇన్‌పుట్‌ సబ్సిడీ ● రాష్ట్ర వ్యవసాయ శాఖ నుంచి ఆదేశాలు

సాక్షి, ఆదిలాబాద్‌: పంట నష్టం గణనకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు యంత్రాంగం సిద్ధమవుతోంది. కరువుగా గుర్తించిన మండలాల్లో రైతుల వి న్నపం మేరకు ఆయా పంటలను ఏఈవోలు సందర్శిస్తారు. అయితే 33 శాతం పైబడి నష్టం ఉంటేనే ఆ క్షేత్రాన్ని గుర్తిస్తారు. అంతకంటే తక్కువగా ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకోరు. రాష్ట్ర ప్రభుత్వం కరు వు ప్రభావిత మండలాలను ప్రకటించిన తర్వాత తాజాగా పంట నష్ట గణన చేపట్టాలని వ్యవసాయ శాఖ నుంచి తాజాగా ఆదేశాలు వెలువడ్డాయి. మా ర్గదర్శకాలు జారీ చేసింది. ఈ ప్రక్రియను క్రమబ ద్ధంగా, పారదర్శకంగా, ఖచ్చితమైన పద్ధతిలో నిర్వహించాలని అందులో పేర్కొంది.

రైతు వారీగా పరిశీలన..

కరువు ప్రభావిత మండలాల్లో ఆయా రైతులు తమ చేలల్లో పంట నష్టం జరిగిందని అధికారులకు మొ ర పెట్టుకున్న తర్వాత.. ఆ క్షేత్రాన్ని ఏఈవోలు సందర్శించాలని ఆదేశించింది. గ్రామాల వారీగా పంట నష్టగణన పట్టికను తయారుచేసి అర్హత ఉన్న, దెబ్బ తిన్న పొలాలన్నింటిని కవర్‌ చేసేలా గణనను క్రమ పద్ధతిలో నిర్వహించాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. నష్టం అంచనా ఖచ్చితత్వాన్ని ధ్రువీకరించి ఆ వివరాలను రైతు భరోసా యాప్‌లో పొందుపర్చిన కరు వు వానాకాలం 2026 పంట నష్ట నమోదు మాడ్యుల్‌లో నమోదు చేయాలి. గణన జాబితాలు, ఇన్‌పు ట్‌ సబ్సిడీ ప్రతిపాదనలను జిల్లా వ్యవసాయ అధి కారి ధ్రువీకరించిన తర్వాత దాన్ని కలెక్టర్‌కు అందజేయాల్సి ఉంటుందని ఆదేశాల్లో పేర్కొన్నా రు. నవంబర్‌ 10లోగా సమర్పించాలని స్పష్టం చేశారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి..

జిల్లాలో వానాకాలం సీజన్‌లో 5లక్షల 94వేల ఎకరాల్లో పత్తి, సోయా, కందులు, ఇతరత్రా పంటలు సాగయ్యాయి. ఇందులో పత్తి అత్యధికంగా 4లక్షల 37వేల ఎకరాల్లో సాగైంది. ఈ సీజన్‌లో జిల్లాలో 33 శాతం లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కరువు ప్రభావిత మండలాలను గుర్తించగా, జిల్లాలో ఏకంగా 20 మండలాలను పొందుపర్చారు. ఇందులో నాలుగు మండలాల్లో తీవ్రంగా, 16 మండలాల్లో మధ్యస్థంగా కరువు ఉన్నట్లు పేర్కొన్నారు. వర్షాభావం కారణంగా పలుచోట్ల పంటలు వాడిపోయి ఎండిపోయాయి. దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. సరైన దిగుబడులు రాకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. జిల్లా పరంగా లక్ష 30వేల ఎకరాల నుంచి లక్ష 47వేల ఎకరాల వరకు నష్టపోయినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. పంట నష్టగణన ద్వారా పూర్తి స్పష్టత రానుంది.

రైతు వారీగా అంచనా..

పంట నష్ట సర్వే చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. రైతు వారీగా నష్టాన్ని అంచనా వేయడం జరుగుతుంది. 33 శాతం నష్టం పైబడిన చేలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. రైతుల జాబితా ను తయారు చేస్తాం. ప్రభుత్వానికి పంపిస్తాం. దానికి అనుగుణంగా ఇన్‌పుట్‌ సబ్సి డీకి ఆయా రైతులు అర్హత పొందుతారు.

– రవీందర్‌సింగ్‌,

జిల్లా వ్యవసాయశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement