వంటింట్లో ధరల మంట! | - | Sakshi
Sakshi News home page

వంటింట్లో ధరల మంట!

Oct 31 2026 8:31 AM | Updated on Oct 31 2026 8:31 AM

సెంచరీకి చేరువలో సన్నబియ్యం

కొండెక్కిన పప్పులు.. కాగుతున్న నూనెలు

ఉల్లి, కూరగాయల ధరలు భగభగ

చుక్కలనంటుతున్న నిత్యావసరాలు

తలకిందులవుతున్న మధ్యతరగతి బడ్జెట్‌

బోథ్‌: ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు సామాన్యుడి వంటింట్లో మంటలు పుట్టిస్తున్నాయి. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు అ మాంతం పెరిగిపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌ తలకిందులవుతోంది. బియ్యం, నిత్యావసర ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు.

సెంచరీ వైపు సన్నబియ్యం..

జిల్లాలో సన్నబియ్యం ధర మునుపెన్నడూ లేని విధంగా ఆకాశాన్నంటుతోంది. కిలో ధర ఏకంగా రూ.100 వైపు దూసుకుపోతోంది. జిల్లాలో ఎక్కువగా ఎక్కువగా వినియోగించే జైశ్రీరామ్‌ రకం క్వింటాలుకు రూ.9,000కు చేరింది. ఇక హెచ్‌ఎంటీ రూ.7వేల నుంచి రూ.8వేలు పలుకుతుండగా.. బీపీటీ రూ.6,500 నుంచి రూ.7,000 వరకు విక్రయిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల దిగుబడి తగ్గుతుందన్న సాకుతో కొంతమంది వ్యాపారులు, మిల్లర్లు కుమ్మకై ్క కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రకృతి విపత్తుల కంటే దళారులు, మిల్లర్ల మాయాజాలమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని ప్రజలు మండిపడుతున్నారు. ధరలు మరింత పెరుగుతాయన్న భయంతో సామాన్య కుటుంబాలు అప్పుచేసి మరీ ముందస్తుగా కొనుగోలు చేయాల్సిన దుస్థితి.

పప్పులకు రెక్కలు.. నిత్యావసరాల మోత!

రోజువారీగా ఉపయోగించే నిత్యావసర సరుకుల ధరలు సైతం భారీగా పెరిగాయి. కిరాణా దుకా ణల్లో ప్రతి వస్తువుకూ రెక్కలొచ్చాయి. కందిపప్పు, నువ్వులు, పల్లీలు, పెసరపప్పు, చక్కెర వంటివి గతంతో పోల్చితే 10 నుంచి 30శాతం వరకు పెరిగాయి. వంటనూనెలదీ అదే దారి. వీటి ధరలు సైతం10 శాతం వరకు పెరిగాయి. ఫలితంగా సగటు కుటుంబానికి నెలకు అయ్యే కిరాణా ఖర్చు భారీగా పెరిగిపోయింది.

కూరగాయలదీ అదే బాట..

నిత్యావసర సరుకులకు తోడుగా కూరగాయల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. ఉల్లి ధర కిలో రూ.70 దాటి సామాన్యుడి కళ్లల్లో నీళ్లు తెప్పిస్తోంది. పచ్చిమిర్చి, ఇతర ప్రధాన కూరగాయలు కిలో రూ.100 మార్కును తాకాయి. సాధారణంగా స్థానికంగా పండించే కూరగాయలు కూడా కిలో రూ.80 చొప్పున విక్రయిస్తుండడం గమనార్హం.

మార్కెట్లో ప్రస్తుత ధరల తీరు (కిలో రూ.లలో)

నిత్యాసరాలు నెలక్రితం ప్రస్తుతం

సన్నబియ్యం(జైశ్రీరామ్‌) 50–60 90–100

కందిపప్పు 115 160

నువ్వులు 135 190

పల్లీలు 150 160

పెసరపప్పు 110 120

చక్కెర 48 50–60

ఉల్లి 40 80–100

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement