తాంసి: ఎల్‌నినోతో పాటు మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు వ్యవసాయంలో మా ర్పులకు సన్నద్ధమై వివిధ పంటలు సాగు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. భీంపూర్ మండలంలోని పిప్పల్‌కోటిలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సాగుభూమి సంరక్షణ రైతు అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారు. వివిధ అంశాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం భీంపూర్ మండలాన్ని కరువుగా ప్రకటించిదని తెలిపారు. పంట దిగుబడి రాలేదని రైతులు అధైర్యపడవద్దని ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. పిప్పల్‌కోటి రిజర్వాయర్ భూములు కోల్పోతున్న వారందరికీ పరిహరం అందేలా చూస్తామన్నారు. అనంతరం వీబీజీ రామ్‌జీ పథకంలో భాగంగా నిర్మిస్తున్న నీటికుంటల పనులు, ఇంకుడు గంతల నిర్మాణాలను పరిశీలించారు. పంటచేలకు నడుచుకుంటూ వెళ్లి పనులపై ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్‌సింగ్, డీఆర్డీవో రవీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ నారాయణ, కేవీకే శాస్త్రవేత్త రాంగోపాల్ వర్మ, తహసీల్దార్ రమేశ్, ఎంపీడీవో గోపాలకృష్ణారెడ్డి, ఏవో శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ రమేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
మాతా శిశు మరణాలు తగ్గించాలి
ఆదిలాబాద్‌టౌన్: మాతా శిశు మరణాలు తగ్గించేందుకు వైద్యులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శుక్రవారం రిమ్స్‌లో పీడియాట్రిక్, గైనిక్ విభాగాల వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఇటీవల గర్భిణి మృతిచెందగా, మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గర్భిణి మృతికి సంబంధించి విచారణ కమిటీ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన సీడబ్ల్యూసీ జీఎం
కై లాస్‌నగర్: సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ) జనరల్ మేనేజర్ పంకజ్‌సింగ్ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా కలెక్టర్ రాజర్షి షాను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో నూతన గోదా ముల నిర్మాణం, ఇప్పటికే ఉన్న నిల్వ సదుపాయాల విస్తరణ, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించే అంశాలపై ఇరువురు చర్చించారు.


