● క్వింటాలుకు మరో రూ.100 డౌన్
ఆదిలాబాద్‌టౌన్: పత్తిధర రోజు రోజుకు తగ్గుతోంది. జిల్లాలో కొనుగోళ్ల ప్రారంభమైన రోజు ప్రైవే ట్ వ్యాపారులు క్వింటా లుకు రూ.9,260తో కొనుగోలు చేసిన విష యం తెలిసిందే. రెండు రోజుల పాటు అదేధర పెట్టిన వ్యాపారులు మరుసటి రోజు రూ.60 తగ్గించి రూ.9,200, ఆ తర్వాత రూ. 9,100 తగ్గిస్తూ వచ్చారు. శుక్రవారం రూ.9వేలతో కొనుగోలు చేశారు. అంతర్జాతీయ మార్కె ట్లో భేల్ ధర అధికంగా ఉన్నప్పటికీ, ప్రైవేట్ వ్యా పారులు ధర నిర్ణయించడం లేదని రైతులు ఆ వేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మహా రాష్ట్రకు చెందిన పలువురు ప్రైవేట్ వ్యాపారులు ఆయా గ్రామాలకు వచ్చి క్వింటాలుకు రూ. 9,500తో కొనుగోలు చేస్తున్నారని రైతులు పే ర్కొంటున్నారు. ఇప్పటివరకు 976 మంది రై తుల నుంచి ప్రైవేట్ వ్యాపారులు 18,647 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశా రు. శుక్రవారం 193మంది నుంచి 3,624 క్వింటాళ్ల పత్తిని కొ నుగోలుచేసినట్లు ఆదిలాబాద్ వ్యవసాయ మా ర్కెట్ కమిటీ కార్యదర్శి విఠల్ తెలిపారు. కాగా, ఎల్‌నినో ప్రభావంతో దిగుబడి లేక ఇప్పటికే రైతులు అవస్థలు పడుతుండగా, ధర తగ్గుతుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పత్తి ధర పెంచేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


