టీఆర్‌ఎస్‌ పటిష్టతపై ఫోకస్‌ | - | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ పటిష్టతపై ఫోకస్‌

Oct 31 2026 8:31 AM | Updated on Oct 31 2026 8:31 AM

● ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతంపై కవిత దృష్టి ● ఇంద్రవెల్లి సభ సక్సెస్‌తో శ్రేణుల్లో జోష్‌

కైలాస్‌నగర్‌/ఇంద్రవెల్లి: ఉమ్మడి ఆదిలాబాద్‌లో తె లంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) బలోపేతం దిశగా ఆ పార్టీ చీఫ్‌ కల్వకుంట్ల కవిత దృష్టి సారించారు. ఇంద్రవెల్లి వేదికగా శుక్రవారం నిర్వహించిన పాంచజన్య సభలో ఆయా నియోజకవర్గాల నేతలను జ నానికి పరిచయం చేస్తూ, రాష్ట్రంలో కొత్త పార్టీ ఆవశ్యకతను వివరించారు. ముందుగా ముత్నూర్‌లోని కుమురంభీం విగ్రహానికి నివాళులర్పించారు. అక్క డి నుంచి ప్రత్యేక వాహనంలో పార్టీ శ్రేణులతో కలి సి ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని సందర్శించా రు. అనంతరం నిర్వహించిన సభలో ఇంద్రవెల్లి పుణ్యభూమికి పాదాభివందనమంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లపై ధ్వజం ..

కవిత తన ప్రసంగంలో ఉమ్మడి జిల్లా వెనుకబాటు ను ప్రస్తావిస్తూ ఇన్నేళ్లు పాలించిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లపై మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక రెండు నెలలకోసారి జిల్లాకు వస్తానన్న ముఖ్యమంత్రి మూడేళ్లలో కేవలం రెండుసార్లు మాత్రమే వచ్చారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను సైతం నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఇక బీఆర్‌ఎస్‌ పదేళ్ల పా లనలోనూ ఈ ప్రాంతానికి ఒరిగిందేమీ లేదన్నారు. యూనివర్సిటీ హామీని కేసీఆర్‌ విస్మరించారని, కనీసం ఇంజినీరింగ్‌ కాలేజ్‌ కూడా ఇవ్వలేదన్నారు. దీనిపై కేటీఆర్‌ జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆదిలాబాద్‌లో సీసీఐని తెరిపించకుండా చేసిన పాపం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలదేనని ఆరోపించారు. నాగోబా తల్లి దయతో మా పార్టీ తొలి జెండా ఇక్కడ నుంచే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, సభ సక్సెస్‌ తో శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. కార్యక్రమంలో మాజీ మంత్రి బోడ జనార్దన్‌, మాజీ ఎమ్మెల్యే రాథో డ్‌ బాపూరావు, సభ రాష్ట్ర పరిశీలకులు పడిగపాటి విక్రాంత్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జీలు మేస్రం దయాకర్‌, వేణుగోపాల్‌, కావేటి సబిత, కాదాసీ గీత, డాక్టర్‌ చంద్రప్రకాశ్‌, కె.వినోద్‌చారి, నిర్మల్‌ జిల్లా అధ్యక్షుడు లోకిని రాము, పార్లమెంట్‌ ఇన్‌చా ర్జి మడావి బాపురావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement