జిల్లాస్థాయి క్రీడా ఎంపిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాస్థాయి క్రీడా ఎంపిక పోటీలు

Oct 31 2026 8:31 AM | Updated on Oct 31 2026 8:31 AM

ఆదిలాబాద్‌: ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి క్రీడా ఎంపిక పోటీలు నిర్వహించారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన పోటీలను ఇన్‌చార్జి డీఈవో అశోక్‌, డీవైఎస్‌వో దయానందరెడ్డి, డీటీఎస్‌వో పార్థసారథి ప్రారంభించి మాట్లాడారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు క్రీడలు ఎంతో ముఖ్యమని అన్నారు. సాధారణ విద్యార్థులతో సమానంగా పోటీపడేందుకు క్రీడలు మంచి వేదికగా నిలుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌జీ ఎఫ్‌ సెక్రెటరీ రామేశ్వర్‌, విద్యాశాఖ అధికారులు లక్ష్మణ్‌, తిరుపతి, పీఈటీలు కాంతారావు, రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement