పాఠాలు విని.. భోజనం చేసి.. | - | Sakshi
Sakshi News home page

పాఠాలు విని.. భోజనం చేసి..

Oct 30 2026 12:51 AM | Updated on Oct 30 2026 12:51 AM

బోథ్‌: మండలంలోని పొచ్చెర గ్రామపంచాయతీ పరిధిలోగల మండల పరిషత్‌ ప్రాథమిక, జిల్లా పరి షత్‌ ఉన్నత పాఠశాలలను ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ వంశీకృష్ణారెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. తరగతి గదుల్లో విద్యార్థులతో కలిసి పాఠాలు విన్నారు. ఉపాధ్యాయుల బోధన తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని మధ్యాహ్న భోజనం చేశారు. మెనూ ప్రకారం పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థులకు పౌష్టికాహా రం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. స్థానిక సర్పంచ్‌ రేఖ రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీడీవో ఎల్‌.రమేశ్‌, పంచాయతీ కార్యదర్శి గంగయ్య, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement