పంచాయతీ కార్యదర్శి నుంచి.. | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ కార్యదర్శి నుంచి..

Oct 30 2026 12:51 AM | Updated on Oct 30 2026 12:51 AM

తాంసి మండల కేంద్రానికి చెందిన నర్సయ్య–లక్ష్మి దంపతుల చిన్నకుమారుడు అశోక్‌కుమార్‌. 2014–25 వరకు పంచాయతీ కార్యదర్శిగా జైనథ్‌ మండలం సుందరగిరి, నిర్మల్‌లో పనిచేశారు. ఒకటి నుంచి పదోతరగతి వరకు తాంసిలోని జెడ్పీ హైస్కూల్‌లో చదివారు. ఇంటర్మీడియట్‌ పట్టణంలోని లయోల కళాశాలలో, డిగ్రీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్తి చేశారు. యూపీఎస్సీ సాధనే లక్ష్యంగా సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. 2016లో ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. గతేడాది గ్రూప్‌–1 కొద్దిమార్కుల తేడాతో తప్పింది. అయినా నిరాశ చెందకుండా శ్రమించి గ్రూప్‌–2లో విజయం సాధించారు. తన అన్న శ్రీకాంత్‌ అందించిన ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయికి చేరానని అశోక్‌కుమార్‌ తెలిపారు. సివిల్స్‌ సాధించడమే లక్ష్యమని, ఆ దిశగా ముందుకు సాగుతానని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement