ఆదిలాబాద్: నిరంతర సాధన, క్రమశిక్షణతోనే క్రీడల్లో పతకాలు సాధ్యమని డీవైఎస్వో దయానంద్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గురువారం ఎస్జీఎఫ్ అండర్–14, 17 బాలబాలికల జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలను డీటీఎస్వో పార్థసారథితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అథ్లెటిక్స్‌లో రాణించిన క్రీడాకారులకు ఇతర క్రీడల్లోనూ రా ణించే అవకాశాలుంటాయని తెలిపారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చి, జోనల్, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రదర్శనతో జిల్లా కీర్తి ని చాటాలని ఆకాంక్షించారు. ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామేశ్వర్, అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజేశ్, ట్రెజరర్ వీజీ ఎస్ రాకేశ్, శిక్షకులు జ్యోతిస్వరన్ ఉన్నారు.


