భర్త ప్రోత్సాహంతోనే.. | - | Sakshi
Sakshi News home page

భర్త ప్రోత్సాహంతోనే..

Oct 30 2026 12:51 AM | Updated on Oct 30 2026 12:51 AM

జైనథ్‌ మండలం కూర గ్రామానికి చెందిన అల్లూరి రాఘవేందర్‌రెడ్డి–సవిత దంపతుల కూతురు తేజశ్రీరెడ్డి. ఒకటి నుంచి 10వ తరగతి వరకు గ్రామంలోని జెడ్పీ హైస్కూల్‌లో చదివారు. ఇంటర్మీడియట్‌ నిజామాబాద్‌లోని ప్రైవేట్‌ కళాశాలలో, బీఫార్మసీ హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కళాశాలలో పూర్తిచేశారు. పెళ్లి తర్వాత మూడేళ్లపాటు హైదరాబాద్‌లో ఉంటూ నాగార్జున స్టడీ సర్కిల్‌లో గ్రూప్స్‌కు సిద్ధమయ్యారు. తొలుత పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం సాధించారు. ఆ తర్వాత ఎఫ్‌బీవో, కమర్షియల్‌ ట్యాక్స్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా కొంతకాలం పనిచేశారు. గ్రూప్‌–3లో 158వ ర్యాంక్‌ సాధించి ఉద్యోగం వచ్చినా మరొకరికి ఆ ఉద్యోగం దక్కాలనే ఉద్దేశంతో సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లలేదు. గ్రూప్‌–2లో ర్యాంక్‌ సాధించి ఈ ఉద్యోగానికి ఎంపికయ్యారు. తన భర్త సాత్విక్‌రెడ్డి అందించిన ప్రోత్సాహంతోనే ఈ ఉద్యోగాలు సాధించగలిగానని ఆమె చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement