బజార్‌హత్నూర్ మండలం కొలారి గ్రామానికి చెందిన రాధ–నర్సింహులు సంతానం బుద్దేవార్ ముఖేశ్. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన ఒకటి నుంచి ఏడో తరగతి వరకు సొనాల మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివారు. ఎనిమిది నుంచి 10వరకు జెడ్పీ హైస్కూల్‌లో విద్యనభ్యసించారు. బాసరలో ట్రిపుల్‌ఐటీలో ఇంటర్మీడియట్, డిగ్రీ ఖైరతాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్తిచేశారు. తొలుత జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగానికి ఎంపికై రెండేళ్ల పాటు బోథ్ మండలం కౌటలో పనిచేశారు. ఉద్యోగం చేస్తూనే ఇరిగేషన్‌శాఖలో జూనియర్ అసిస్టెంట్ కొలువు సాధించి ఐదేళ్ల పాటు ఆ శాఖలో సేవలందించారు. అయితే, రెవెన్యూ శాఖలో గజిటెడ్ అధికారిగా పనిచేయాలని చిన్నప్పటి నుంచి తనకు ఆసక్తి. బాబాయి సంజీవ్ 2012లో గ్రూప్–2 ద్వారానే ఏఎస్వోగా ఉద్యోగం సాధించారు. ఆయన లాగే తానూ పనిచేయాలనే లక్ష్యంతో చదివారు. యువత నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా నిరంతరం చదివితే తప్పకుండా లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఆయన చెబుతున్నారు.


