కై లాస్‌నగర్: రిమ్స్‌లో కవలలతో పాటు మృతి చెందిన గర్భిణి సునీత కుటుంబానికి న్యాయం చేయాలని టీపీసీసీ ఎస్సీసెల్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ కోరారు. బాధిత కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ రాజర్షి షాను బుధవా రం కలిసి వినతిపత్రం అందజేశారు. వైద్యులు, విధుల్లో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని కలెక్టర్ దృష్టికి తీ సుకెళ్లారు. కలెక్టర్ స్పందిస్తూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటా మని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో దళిత జేఏసీ అధ్యక్షుడు కాంబ్లే ప్రజ్ఞాశీల్, వెంకటేశ్, రాజ్‌కుమార్, రాజేశ్వర్ త దితరు ఉన్నారు.


