వెల్లడైన కరువు మండలాలు
పంట నష్టపరిహారం కీలకం
నివేదికల ఆధారంగా సాయం
సర్వే ఆధారంగా లబ్ధిదారుల జాబితా
కేంద్ర సాయం అందిన నెలలోపే ప్రత్యక్ష నగదు బదిలీ
సహాయక చర్యలు ఇలా..
సాక్షి,ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించిన విషయం తెలిసిందే. జీవో ఎంఎస్ నం.3 ద్వారా జారీ చేసిన నోటిఫికేషన్‌లో జిల్లా కలెక్టర్లకు పలు ఆదేశాలు ఇచ్చింది. జా తీయ కరువు నిర్వహణ మ్యానువల్–2016 ని బంధనల ప్రకారం శాసీ్త్రయ పద్ధతిలో మదింపు చేసి, క్యాబినెట్ ఉపసంఘం సిఫార్సు మేరకు ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. ఇందులో జిల్లాకు సంబంధించి 20 మండలాలు ఉన్నప్పటికీ, నాలుగు మండలాల్లో తీవ్రంగా, 16 మండలాల్లో మధ్యస్థంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్ ఆరు నెలల పాటు అమలు లో ఉండనుంది. ఈ కాలంలో వివిధ సహాయక చర్యలు చేపట్టాలని అందులో పేర్కొంది.
జిల్లాలో ఇలా..
ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాకు సంబంధించి జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 33 శాతం లోటు వర్షపాతం నమోదైంది. సాధారణ విస్తీ ర్ణం అంచనా మేరకు జిల్లాలో 5లక్షల 90వేల ఎకరాలకు పైగా వివిధ పంటలు సాగయ్యాయి. అందులో పత్తి 4లక్షల37వేల ఎకరాల్లో సాగు కావ డం గమనార్హం. లోటు వర్షపాతం కారణంగా పత్తి, సోయా, కంది, ఇతరత్రా అన్ని పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. దిగుబడులు సగానికి పైగా తగ్గాయి. రైతులు పంట నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అందించే నష్టపరిహారంపై రైతులు ఆశలు పెంచుకున్నారు. పంట నష్టం అంచనా కోసం సర్వే నిర్వహించాల్సి ఉంటుంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే 33 శా తానికి పైగా విస్తీర్ణంలో పంటనష్టం జరిగితే పరి గణలోకి తీసుకుంటారని అంచనా వేస్తున్నారు.
కేంద్ర సాయం అందిన తర్వాతే..
కరువు మండలాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ప్రధానంగా ఇన్‌పుట్ సబ్సిడీ కేంద్రం నుంచి సహాయం అందిన తర్వాతే రైతులకు అందనుంది. ఆ సాయం అందిన నెలలోపే ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ప్రభావిత రైతులందరికీ అందజేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌లో ఆదేశించింది. లబ్ధిదారుల జాబితాను సంబంధిత జిల్లా యంత్రాంగం ప్ర భుత్వ వెబ్‌సైట్లలో ప్రచురించాలని పేర్కొంది.
పర్యవేక్షణకు సంబంధించి కూడా..
సహాయక చర్యల విషయంలో జీవో నం.3లో ప్ర భుత్వం వివిధ అంశాలను స్పష్టంగా పేర్కొంది. ఈ విషయంలో జిల్లా అధికారులు ఇప్పటివరకై తే ఎలాంటి స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ ఆ నో టిఫికేషన్‌లోని అంశాల ఆధారంగా.. కలెక్టర్, వ్య వసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖల అధి కారులు, సివిల్‌సప్లై కార్పొరేషన్ అధికారులు వెంటనే సహాయక చర్యలను ప్రారంభించి లబ్ధి దారులు, ఖర్చుల వివరాలకు సంబంధించి రిజి స్టర్‌ను నిర్వహించాలని పేర్కొనడం గమనార్హం.


