స్పోకెన్‌ ఇంగ్లిష్‌తో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం | - | Sakshi
Sakshi News home page

స్పోకెన్‌ ఇంగ్లిష్‌తో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం

Oct 29 2026 12:12 AM | Updated on Oct 29 2026 12:12 AM

కై లాస్‌నగర్‌: స్పోకెన్‌ ఇంగ్లిష్‌తో విద్యార్థుల్లో ఆత్మవి శ్వాసం పెంపొందేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. ఆరోగ్య పా ఠశాల కార్యక్రమంలో భాగంగా అక్టోబర్‌లో స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కార్యక్రమం అమలు, పురోగతిపై కలెక్టరేట్‌లో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాషపై అవగాహన, మాట్లాడే నైపుణ్యం వి ద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నా రు. అనంతరం స్పోకెన్‌ ఇంగ్లిష్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.ఇందులో ఆరోగ్య పాఠశాల జిల్లా కోఆర్డినేటర్‌ అజయ్‌, ఉపాధ్యాయులు రఘునాథ్‌, అన్వర్‌ అలీ, విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు మె రుగైన వైద్య సేవలు అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ రాజర్షిషా ఆదేశించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, బాధితులకు అందుతున్న వైద్య సాయం, పీఎం రహత్‌’ పథకంపై బుధవారం కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించా రు. కలెక్టర్‌ మాట్లాడుతూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రధాన ఆస్పత్రుల్లో అత్యవసర వైద్య సేవలను మ రింత పటిష్టం చేయాలన్నారు. ప్రస్తుతం రిమ్స్‌కు రోడ్డు ప్రమాద కేసులు ఎక్కువగా వస్తున్నందున, ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ‘పీఎం రహత్‌’ కింద రోడ్డు ప్రమాద బాధితులకు ఆర్థిక భరోసా లభిస్తుందని, పథకం ద్వారా ప్రమాదంలో గాయపడిన ఒక్కో పేషెంట్‌కు వైద్య ఖర్చుల నిమి త్తం రూ.1.50 లక్షల వరకు వెచ్చించడానికి అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో సాధన, రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌, మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ రోహిత్‌, ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్‌ సత్యనారాయణ, టీం లీడర్‌ వ్యాస్‌, 108 కోఆర్డినేటర్‌ శేఖర్‌, ఈదార్‌ మేనేజర్‌ నితిన్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టర్‌ను కలిసిన నాయబ్‌ తహసీల్దార్లు

కై లాస్‌నగర్‌:గ్రూప్‌–2 సర్వీసెస్‌ ద్వారా ఎంపికై వృత్తిపరమైన శిక్షణ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించబడిన ప్రొబేషనరీ నాయబ్‌ తహసీల్దార్లు బుద్దెవార్‌ ముకేష్‌, బిట్లింగు ఉదయ్‌, అల్లూరి తేజస్వి, జనకొండ అశోక్‌ కుమార్‌ బుధవారం కలెక్టర్‌ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిశారు. తన క్యాంపు కార్యాలయంలో కలిసి రిపోర్టు చేశారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్‌ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ, ఉత్తమ సేవలందించాలని సూచించారు. గురువారం వారికి మండలాల్లో పోస్టింగ్‌ ఇవ్వనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement