నిర్మల్‌టౌన్: ఈ నెల 30న ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించనున్న టీఆర్‌ఎస్ పాంచజన్య సంకల్ప సభను జయప్రదం చేయాలని పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బోడ జనార్దన్ కోరారు. మంగళవారం నిర్మల్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం అనే సిద్ధాంతాలతో కవిత ప్రజల ముందుకు వస్తున్నారని తెలిపారు. అనంతరం సభకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్‌సింగ్, జిల్లా అధ్యక్షుడు రాము, నియోజకవర్గ ఇన్‌చార్జి చంద్రప్రకాశ్, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, నరేశ్‌నాయక్ పాల్గొన్నారు.


