ప్రమాదవశాత్తు కాలువలో పడి వృద్ధుడి మృతి | - | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తు కాలువలో పడి వృద్ధుడి మృతి

Oct 28 2026 12:18 AM | Updated on Oct 28 2026 12:18 AM

జన్నారం: ప్రమాదవశాత్తు కడెం 13 డిస్ట్రీబ్యూటరీ కాలువలో పడి వృద్ధుడు మృతి చెందిన ఘటన మండలంలోని రేండ్లగూడలో చోటు చేసుకుంది. ఎస్సై ఉదయ్‌కిరణ్‌, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రేండ్లగూడకు చెందిన అల్లం రాజలింగు (65) రోజులాగే మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో వాకింగ్‌కు వెళ్లాడు. 6గంటల వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కొడుకు వెంకట్రాజం వెతకగా కాలువ నీటిలో మృతదేహం కనిపించింది. కుడి చెవి పక్కన బలమైన గాయముంది. వాకింగ్‌ చేసే క్రమంలో కాలువలో జారిపడి బలమైన గాయం కావడంతో నీటిలో మునిగి మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంకట్రాజం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పొనకల్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ అల్లం రవి, రేండ్లగూడ సర్పంచ్‌ అల్లం మాధవి, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు అజ్మీర నందునాయక్‌ తదితరులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement