చైల్డ్‌ పోర్న్‌ వీడియోలు అప్‌లోడ్‌ చేస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

చైల్డ్‌ పోర్న్‌ వీడియోలు అప్‌లోడ్‌ చేస్తే చర్యలు

Oct 28 2026 12:18 AM | Updated on Oct 28 2026 12:18 AM

లక్ష్మణచాంద: చైల్డ్‌ పోర్న్‌ వీడియోలు చూసినా, సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసినా చట్టరీత్యా కఠినచర్యలు తప్పవని సోన్‌ సీఐ గోవర్ధన్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం సోన్‌ సీఐ కార్యాలయంలో మంగళవారం ఆ యన వెల్లడించిన వివరాల ప్రకారం.. సో న్‌, మామడ మండలాల్లోని రెండు గ్రామాలకు చెందిన యువకులు తమ మొబైల్‌ ఫోన్లలో ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లలో చైల్డ్‌ పోర్న్‌ వీడియోలు, చిత్రాలు చూడటమే గాకుండా ఇతరులు చూసేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. టెక్నాలజీ, ఐటీ విభాగం పోలీసులు గమనించి వీడియోలు అప్‌లోడ్‌ చేసిన యువకులను గుర్తించారు. వీరిపై మామడ, సోన్‌ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు.

లారీ బోల్తా

ఇంద్రవెల్లి: లారీ బోల్తా పడిన ఘటన మంగళవారం మండలంలోని ఏమాయికుంట సమీపంలో చోటు చేసుకుంది. పత్తి గింజల లోడ్‌తో లారీ ఉట్నూర్‌ నుంచి ఆదిలాబాద్‌ వైపు వెళ్తుండగా ఏమాయికుంట గ్రామ సమీపానికి చేరుకోగానే అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ప్రమాదాన్ని ముందుగానే గమనించిన డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో అతడికి ప్రాణాపాయం త ప్పింది. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి ట్రాఫిక్‌కు సమస్య పరిష్కరించారు.

ఒకరి రిమాండ్‌

ఇంద్రవెల్లి: తాగిన మైకంలో బండతో బస్సు అద్దాలు ధ్వంసం చేసిన ఒకరిపై కేసు నమో దు చేసినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 22న ఉట్నూర్‌ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఆదిలాబాద్‌ నుంచి ఉట్నూర్‌కు వెళ్తోంది. మండలకేంద్రంలోని అంజీ చౌక్‌ వద్ద మద్యం తాగిన మైకంలో ఉన్న పాటగూడ గ్రామానికి చెందిన మెస్రం నాగోరావ్‌ బండ రాయితో కొట్టగా బస్సు కుడి వైపు విండో అద్దం పగిలింది. బస్సు డ్రైవర్‌ చావన్‌ నగేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని ఆరెస్ట్‌ చేసి మంగళవారం రాత్రి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపిక

తాండూర్‌: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు మండలంలోని రేచిని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని గిరుగుల అక్షర ఎంపికై నట్లు పీడీ సంతోష్‌కుమార్‌ తెలిపారు. అక్షర ఈ నెల 29నుంచి 31వ తేదీ వరకు మేడ్చల్‌లో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొననుందని పేర్కొన్నారు. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభకనబర్చి జిల్లాకు మంచి పేరు తేవాలని ప్రధానోపాధ్యాయుడు ప్రదీప్‌, సర్పంచ్‌ రాంబాయి ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement