అప్రమత్తతతోనే సైబర్ నేరాల నివారణ
రైతులు గంజాయి సాగు చేస్తే ప్రభుత్వ పథకాలు కట్
భూ మాఫియాపై ఇప్పటికే ఉక్కుపాదం
అంతర్రాష్ట్ర దొంగల ముఠాపై కొరడా
‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: ‘చట్టం ముందు అందరూ స మానులే.. తప్పు చేసిన వారు ఎంతటివారైనా సహించేది లేదు.. కేసులు నమోదు చేసి కటకటా ల వెనక్కి పంపిస్తాం.. జిల్లాలో భూ మాఫియా గతం కంటే తగ్గింది.. గంజాయి, మాదకద్రవ్యాలు, సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాలపై ప్ర త్యేక దృష్టి సారించాం.. ఎవరైనా మోసపోతే పోలీసులను ఆశ్రయించాలి.. వారికి అండగా ఉంటాం.. న్యాయం జరిగేలా చూస్తాం..’ అని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ‘సాక్షి’కి సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.
సాక్షి: జిల్లాలో ఇటీవల సైబర్ నేరాలు పెరుగుతున్నాయి.. వీటిని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..?
ఎస్పీ: సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రతీ పోలీ స్‌స్టేషన్‌లో ఇప్పటికే సైబర్ వారియర్, సోషల్‌మీడియా వారియర్‌లను ఏర్పాటు చేశాం. అలాలగే జిల్లావ్యాప్తంగా సైబర్ సెల్ టీమ్‌ను అందుబాటులో ఉంచాం. గడిచిన మూడు నెలల్లో 15 మంది సైబర్ అంతర్రాష్ట్ర నేరగాళ్ల ను రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, మహారా ష్ట్ర, బిహార్ తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చాం. గ్రామాల్లో మీకోసం కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో ఖాకీ కిడ్స్ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం.
సాక్షి: భూమాఫియాపై ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..?
ఎస్పీ: భూమాఫియాలో ఎంతటివారినైనా వదిలి పెట్టం. ఇటీవల ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పలువురు బడా బాబులను సైతం జైలు కు పంపించాం. గతం కంటే ప్రస్తుతం భూ మాఫియా కేసులు తగ్గాయి. మోసం చేసినవారు బాధితుల వద్దకు వెళ్లి సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. దీంతో వారు కోల్పోయిన డ బ్బులు తిరిగి పొందుతున్నారు. ఇప్పటివరకు 75 వరకు కేసులు నమోదయ్యాయి.
సాక్షి: అంతర్రాష్ట్ర మోసాల్లో జిల్లాకు చెందిన పలువురు మోసపోయారు. వారికి ఎలాంటి న్యాయం చేకూర్చుతారు..?
ఎస్పీ: అంతర్రాష్ట్ర ముఠా చేతిలో జిల్లాకు చెందిన పలువురు మోసపోయారు. సాంకేతిక పరిజ్ఞానంతో కేటుగాళ్లను అరెస్ట్ చేసి జైలుకు పంపించాం. ఇందులో సైబర్ నేరగాళ్లు, పశువుల దొంగలతో పాటు యూనిక్, చిట్‌ఫండ్ నింది తులను పట్టుకున్నాం. ప్రజలు ఇలాంటి వారి చేతిలో మోసపోకుండా అప్రమత్తంగా ఉండా లి. అపరిచితులు పంపిన లింక్‌లు ఓపెన్ చే యొద్దు.నిజనిర్ధారణ తర్వాతే సంప్రదించాలి.
సాక్షి: రోడ్డు ప్రమాదాలు తగ్గాయా.. నివారణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..?
ఎస్పీ: జిల్లాలో ఈఏడాది 30 శాతం రోడ్డు ప్రమా దాలు తగ్గాయి. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. హైవేలపైబ్లాక్‌స్పాట్లు, డ్రంబుల్‌స్టిక్స్, ప్రమాదానికి గురైన వాహనాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించ డం వంటి చర్యలు చేపడుతున్నాం. దీంతోపా టు ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నాం. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం.
సాక్షి: జిల్లా ప్రజలకు మీరు ఇచ్చే భరోసా ఏమిటి..?
ఎస్పీ: ప్రజలు మోసపోతే నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలి. నా వాట్సాప్ నం. 8712659973కు సమాచారం ఇవ్వాలి. వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఎలాంటి అక్రమాలు జరిగినా పోలీసులకు తెలియజేయడం ద్వారా వాటిని పరిష్కరించే అవకాశం ఉంటుంది. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌కు మంచి స్పందన ఉంది. 50 శాతం వరకు సమస్యలను పరిష్కరించాం. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ పోలీసులకు సహకరించాలి.
సాక్షి: గంజాయి సాగు, విక్రయదారులపై ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..?
ఎస్పీ: జిల్లాలో గంజాయి సాగు చేస్తున్న 110 మంది రైతులపై కేసులు చేశాం. 250 ఎకరా లకు రైతు భరోసా పథకం రాకుండా సిఫా ర్సు చేయడం జరిగింది. మరోసారి సాగు చేస్తే ప్రభుత్వ పథకాలు రాకుండా చూస్తాం. ఈ ఏడాది 221 కేసులు న మోదు కాగా, 1630 మొక్కలను ధ్వంసం చేశాం. 23కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. గంజాయి సేవించిన 60 మంది యు వకులకు డీ–అడిక్షన్ సెంటర్‌కు పంపాం.


