ఆదిలాబాద్‌రూరల్: కుమురం భీం ఆశయ సా ధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కుమురం భీం వర్ధంతి వే డుకలను జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట గల హీరా సుకా దేవస్థాన ఆవరణలో సోమవా రం నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి ఆయన కుమురంభీం, రాంజీగోండ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించా రు. భీం ఆదివాసీలతో పాటు జిల్లాకే మార్గదర్శి అని కొనియాడారు. ఎస్పీ మాట్లాడుతూ, ఆది వాసీ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, కుమురంభీం స్ఫూర్తితో ముందుకు సా గాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిప ల్ చైర్పర్సన్ అనూష, డిఎస్పీ జీవన్‌రెడ్డి, ఆది వాసీ నాయకులు తానాజీ, శంకర్, యాదవ్రావ్, మాధవ్, రాంకిషన్, ఆనంద్‌రావ్, ఉత్తం, వనిత, తదితరులున్నారు.


