కై లాస్నగర్: ఆదికవి మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్ చిత్రు, మున్సిపల్ చైర్పర్సన్ అనూష అ న్నారు. వాల్మీకి జయంతి వేడుకలను కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వాల్మీకి మహర్షి రచించిన రా మాయణం ఒక ఇతిహాసం మాత్రమే కాదని, ప్రతి మనిషి జీవితానికి మార్గదర్శకమన్నారు. ఇందులో జిల్లా ఎస్సీ, బీసీ అభివృద్ధి అధికారులు సునీతకుమారి, సోనియా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్రావు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు దత్తు తదితరులు పాల్గొన్నారు.


