పులకించిన
కెరమెరి/ఆసిఫాబాద్‌అర్బన్: పోరుగడ్డ జోడేఘాట్ పులకించింది. ఆదివాసీ ముద్దుబిడ్డ, గోండు బెబ్బు లి కుమురంభీంకు నివాళులర్పించేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు ఉమ్మ డి జిల్లా ప్రజలు తరలివచ్చారు. అమరుడికి గిరిజన సంప్రదాయం ప్రకారం నివాళులర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కెరమెరి మండలం జోడేఘాట్‌లో సోమవారం కుమురంభీం 86 వర్ధంతి ఘనంగా నిర్వహించారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూ రి లక్ష్మణ్‌కుమార్, మహిళాశిశు సంక్షేమశాఖ సీతక్క మధ్యాహ్నం ఒంటి గంటకు జోడేఘాట్‌కు చేరుకున్నారు. వీరికి అధికారులు, నాయకులు వారికి పుష్పగుచ్ఛం అందించి గుస్సాడీలతో స్వాగతం పలికారు. ఆదివాసీలు, భీం వారసులతో కలిసి సంప్రదాయ పూజలు చేశారు. పూజలు సైతం ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. కుమురం భీంతోపాటు కొలాం వీరుడు కుము రం సూరుకు నివాళులర్పించారు. అంతకుముందు నాలుగు గోత్రాల జెండాలు ఆవిష్కరించారు.
సమస్యల ఏకరువు
పూజల అనంతరం నిర్వహించిన దర్బార్ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. కుమురం భీం నినదించిన జల్, జంగల్, జమీన్ ఆశయం నేటికీ నెరవేరలేదన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఇసుక, పందిరి వేసేందుకు వెదురు తెచ్చుకోవడానికి కూడా అడ్డుపడుతున్నారని బాధలు వినిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గిరిజనులకు వందశాతం ఇందిరమ్మ గృహా లు ఇస్తామని ఇచ్చిన మాటను సీఎం రేవంత్‌రెడ్డి నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు. కలెక్టర్ హరిత మా ట్లాడుతూ ప్రతీ గిరిజన గ్రామానికి నిరంతరం తా గునీరు అందించేందుకు సావర్‌ఖెడా సమీపంలో రూ.60 కోట్లతో ఇంటెక్‌వెల్ నిర్మిస్తున్నామని తెలి పారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ నితిక పంత్ సూచించారు.
ఆకట్టుకున్న కార్యక్రమాలు
జోడేఘాట్‌లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గోండ్‌గూడ అంగన్‌వాడీ కేంద్రం చిన్నారులు, గుస్సాడీలు చేసిన నృత్యాలు అలరించాయి. వివిధ శాఖల స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా ని లిచాయి. ఐటీడీఏ పీవో మంద మకరందు దోవతి, రుమాలు కట్టుకుని గోండి భాషలో మాట్లాడారు. ఆరుగురు గిరిజనులకు ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు అందించారు. ఉన్నత విద్యనభ్యసిస్తున్న మడావి దత్తు, కోట్నాక్ సంజీవనిలకు ల్యాప్‌టాప్‌లు అందించా రు. భీం మనుమడు సోనేరావు, వారసులకు దుస్తులు అందించి సత్కరించారు. కాగా, గతంతో పోల్చి తే వర్ధంతి కార్యక్రమానికి తక్కు వ మంది జనం హాజరయ్యారు. కార్యక్రమంలో మహిళాశిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీఎస్పీ అశోక్, అదనపు ఎస్పీ చిత్తరంజన్, డీటీడబ్ల్యూవో అంబాజీ, డీఎంహెచ్‌వో నాగేంద్ర, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీపీవో భిక్షపతిగౌడ్, డీఏవో వెంకట్, డీఎఫ్‌వో బాలామణి, ఎస్‌ఈ ఉత్తమ్ జాడె, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మాజీ ఎమ్మెల్యే సక్కు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరిగెల నాగేశ్వర్‌రావు, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక విజయ్, జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్, ఉత్సవ కమిటీ చైర్మన్ పెందూర్ రాజేశ్వర్, సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు, చంద్రన్న, శంకరన్న పాల్గొన్నారు.
వచ్చే వర్ధంతిలోగా సమస్యల పరిష్కారం: మంత్రి సీతక్క
దర్బార్‌లో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. వచ్చే భీం వర్ధంతిలోగా సమస్యలు పరిష్కరించి పోడు భూములకు పట్టాలు, సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. 40 ఏళ్ల క్రితం ఎలాంటి సౌకర్యాలు లేనప్పుడు వర్ధంతికి వచ్చిన జనం, ఇప్పుడు అన్ని సౌకర్యాలు వచ్చాక రాకపోవడం సరికాదన్నారు. సమ్మ క్క, సారక్క, భీం, రాంజీగోండు వంటి వీరులను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కుమురం భీం, ఆదిలాబాద్ జిల్లాల్లో గిరిజనులు అధికంగా ఉంటారని, నిబంధనల పేరుతో అధికారులు కఠినంగా వ్యవహరిస్తే వారి జీవనం మ రింత కష్టమవుతుందని పేర్కొన్నారు. అటవీ అధికారులు కొన్ని సందర్భాల్లో చట్టాలను పక్కన పెట్టి మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరారు. ఇప్పటికే కుమురం భీం జిల్లాలో రూ.180 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, సిర్పూర్‌కు నా నిధుల నుంచి రూ.60 కోట్లు వెచ్చించానని తెలిపారు.
సీఎంతో చర్చిస్తాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్
ఆదివాసీల అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డితో చర్చిస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూ రి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. గిరిజన గ్రామాల్లో అటవీ నిబంధనలతో సమస్యలు పేరుకుపోయాయని పేర్కొన్నారు. గిరిజనులకు శాశ్వత హక్కు ఉండేలా పోడు భూములకు పట్టాలు, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఐటీడీఏలకు పూర్వవైభవం తీసుకువచ్చి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. గిరిజన హాస్టళ్లు, జూనియర్ కళాశాలలను మరింత బలోపేతం కోసం ప్రణాళి కలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. గిరిజనులు, దళితుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రానున్న కాలంలో జోడేఘాట్‌లో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.


