ఆదిలాబాద్: రాష్ట్రస్థాయి ఉషూ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. మంచిర్యాలలో ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించిన ఈ పోటీల్లో వివిధ విభాగాల్లో మొత్తం ఆరు స్వర్ణ, మూ డు రజత, రెండు కాంస్య పతకాలు సాధించా రు. ఇందులో అన్నారపు వీరేశ్ రెండు స్వర్ణాలు, ఒక కాంస్య పతకంతో ప్రతిభ చాటగా, జి.శివకుమార్ ఒక రజత, ఒక కాంస్య పతకంతో మె రిశాడు. డేగె సాత్విక్ ఒక స్వర్ణం,ఒక కాంస్యం, దుర్గా రెండు స్వర్ణాలు,రేణుక దివ్యఒక స్వర్ణం, ఒక కాంస్య పతకం సాధించినట్లు ఉషు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సతీశ్ తెలిపారు. వీరంతా డిసెంబర్లో అరుణాచల్‌ప్రదేశ్ వేదికగా ని ర్వహించనున్న జాతీయ స్థాయిపోటీల్లో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని అసోసియేష న్ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ ఉమర్ తెలిపారు.


