సీతాఫలాలపై ఎల్‌నినో పంజా | - | Sakshi
Sakshi News home page

సీతాఫలాలపై ఎల్‌నినో పంజా

Oct 22 2026 12:15 AM | Updated on Oct 22 2026 12:15 AM

తగ్గిన డిమాండ్‌..

లక్ష్మణచాంద: పేదవాడి ఆపిల్‌గా పిలిచే ఫలం సీతా ఫలం. సీజనల్‌గా లభించే ఈ ఫలంలో మంచి పోషక విలువలు ఉండటంతో, తినడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతారు. సీతాఫలాలకు నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని పీచర గ్రామం కేరాఫ్‌గా నిలుస్తోంది.

పలు కుటుంబాలకు జీవనోపాధి..

ఉదయం 4 గంటలకే నిద్ర లేచి సీతాఫలాలు బుట్టలలో తీసుకొని గ్రామం నుంచి ప్రత్యేకంగా ఆటోలలో దాదాపు 40 నుంచి 60 మంది నిర్మల్‌ జిల్లా కేంద్రానికి వస్తున్నారు. గ్రామంలోని దాదాపు 90 కుటుంబాల వారు ఈ పండ్లు విక్రయిస్తున్నారు. ఇందులో కొందరికి చెట్లు ఉండగా, మరి కొందరు రైతులకు చెట్ల కోసం డబ్బులు చెల్లించి సీతా ఫలా లు అమ్ముతున్నారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌ ప్రాంతంలోని మారుతి మెగా మార్ట్‌ ముందు, మారెమ్మ ఆలయం వద్ద, స్వామి వివేకానం విగ్రహం వద్ద విక్రయిస్తున్నారు.

వర్షాలు లేక..

ఈసారి ఎల్‌నినో కారణంగా సరైన వర్షాలు కురువలేదు. దీంతో సీతాఫలాల మొక్కలకు సరైన నీటి వసతి లేకపోవడంతో కాయల పరిమాణం తగ్గింది. ఎక్కువ కాయలేదని కాసిన కాయలు వాడిపోతున్నాయని వారు పేర్కొంటున్నారు. నీటి వసతి ఉన్న వారు కూడా ప్రస్తుతం నీళ్లు ఇచ్చిన ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు.

సీతాఫలంలో మంచి పోషక విలువలు ఉండటంతో ఎక్కువగా డిమాండ్‌ ఉంటుంది. ఈసారి వర్షాలు లేక కాయలు ఎక్కువ కాయలేదని, కాసిన కాయలు కూడా సరిగా ఎదగక పోవడంతో ఫలాలకు డిమాండ్‌ తగ్గిందని రైతులు తెలిపారు. నిర్మల్‌ మార్కెట్‌లో ఒక్కో పండు ధర రూ.10 నుంచి రూ.15 మాత్రమే ఉంది. ఎంత మంచి ఫలాలు అయినా రూ.20 నుంచి రూ.30 వరకు, కొన్నిటికి రూ.100 వరకు ఉందని అమ్మకం దారులు పేర్కొంటున్నారు. గతంలో ఒక బుట్ట ఫలాలు కావాలంటే జిల్లా కేంద్రంలో రూ.1500 నుంచి రూ.2000 చెల్లించాల్సించే వారు. కానీ నేడు బుట్ట పండ్లు కేవలం రూ.400 నుంచి రూ.500 వరకు ఉండగా ఉదయం నుండి సాయంత్రం వరకు మార్కెట్‌లో ఉన్నా కనీసం రెండు బుట్టలు కూడా అమ్మడం లేదని వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement