వైద్య విద్యకు భరోసా | - | Sakshi
Sakshi News home page

వైద్య విద్యకు భరోసా

Oct 22 2026 12:15 AM | Updated on Oct 22 2026 12:15 AM

పేద విద్యార్థి సాయిచరణ్‌ విద్యకు ఆర్థిక చేయూత ముందుకొచ్చిన గాంధీ మెడికల్‌ కళాశాల పూర్వ విద్యార్థులు

బోథ్‌: పేద విద్యార్థి వైద్య విద్య కు భరోసా లభించింది. చదువు కు, ప్రతిభకు పేదరికం అడ్డు కా కూడదని భావించిన ముగ్గురు వైద్యులు పేద విద్యార్థి డాక్టర్‌ కావాలనే కలకు అండగా నిలి చారు. మండల కేంద్రానికి చెందిన ఇర్నాల రమేశ్‌– విజయ దంపతుల రెండో కుమారుడు సాయి చరణ్‌ కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో సీటు సాధించినప్పటికీ, ఆర్థిక ఇబ్బందులతో చదువు కొనసాగించలేని పరిస్థితి తెలుపుతూ ఈ నెల 4న సాక్షిలో ‘డాక్టర్‌ కలకు పేదరికం అడ్డు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన గాంధీ మెడికల్‌ కళా శాల పూర్వ విద్యార్థులు సాయి చరణ్‌ వైద్య విద్యకు పూర్తి ఖర్చు భరించేందుకు ముందుకొచ్చారు.

రూ.5 లక్షల ఆర్థిక సాయం..

మండల కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవీంద్ర ప్రసాద్‌ సాయి చరణ్‌ కుటుంబ ఆర్థిక పరిస్థితిని గాంధీ వైద్య కళాశాల పూ ర్వ విద్యార్థులు డాక్టర్‌ రోహిణి వంగ (అమెరికా), డాక్టర్‌ విక్రమ్‌ రెడ్డిలతో చర్చించారు. దీంతో స్పందించిన వారు విద్యార్థి భవిష్యత్తుకు భరోసా కల్పించాలని నిర్ణయించుకున్నారు. విడతల వారీగా రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొన్నారు.

మొదటి విడతగా రూ.50 వేల చెక్కు అందజేత

మండల కేంద్రంలోని సాయినగర్‌ కాలనీలో గల దుర్గామాత ఆలయం, శారదాదేవి విగ్రహం వద్ద బుధవారం రూ.50 వేల చెక్కును సాయిచరణ్‌కు డాక్టర్‌ రవీంద్ర ప్రసాద్‌, మాజీ జెడ్పీటీసీ సంధ్యారాణి, ప్రభుత్వ ఉపాధ్యాయులు, రిటైర్ట్‌ ఉపాధ్యాయులు కలిసి అందజేశారు. డాక్టర్‌ రవీంద్ర ప్రసా ద్‌, మాజీ జెడ్పీటీసీ సంధ్యారాణి మాట్లాడుతూ సాయి చరణ్‌ వైద్య విద్యను పూర్తి చేసే వరకు అండగా ఉంటామన్నారు.తమ కుమారుడి విద్య ఖర్చును భరించేందుకు ముందుకొచ్చిన వైద్యులకు సాయి చరణ్‌ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. తమ బిడ్డ డాక్టర్‌ కావాలనే కల నెరవేరేందుకు మార్గం సుగమం కావడంతో వారు భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వ రిటైర్డ్‌ ఉపాధ్యాయులు, బుడగ జంగం కుల పెద్దలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement