బాసర: బాసరలోని పవిత్ర గోదావరి నది తీరం బుధవారం దుర్గామాత నిమజ్జన వేడుకలతో భక్తిసంద్రంగా మారింది. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లాతో పాటు భైంసా పట్టణం, బాసర మండలంలోని పలు గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో దుర్గాదేవి విగ్రహాలను నిమజ్జనం కోసం ఇక్కడికి తరలించారు. మంగళహారతులు, కోలాటాలు, డీజే చప్పుళ్లు, గులాల్ చల్లుకుంటూ భక్తులు అత్యంత ఉత్సాహంగా, శోభాయాత్రగా గోదావరి నది వద్దకు చేరుకున్నారు. మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఒడిబియ్యం సమర్పించి వీడ్కోలు పలికారు.
పత్తి పంటపై
అడవి పందుల దాడి
బోథ్: మండలంలోని బాబెరతాండ గ్రామానికి చెందిన పృథ్వీరాజ్ రాథోడ్‌కు చెందిన రెండు ఎకరాల్లో పత్తి పంటను అడవి పందుల దాడి చేసి ధ్వంసం చేశాయి. బుధవారం సర్పంచ్ రూప్ చంద్ జాదవ్‌తో పాటు వ్యవసాయ శాఖ, అటవీ శాఖ అధికారులు పంటను పరిశీలించారు. అధికారులు పంట నష్టాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.


