ఆదిలాబాద్: జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లోనూ రాణించాలని డీటీఎస్‌వో పార్థసారథి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఎస్జీఎఫ్ అండర్–14 బాలికల బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపైనా దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో పీడీలు సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం
ఆదిలాబాద్‌టౌన్: బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని జిల్లా బాలల సంరక్షణ అధికారి(డీసీపీఓ) రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మంగళవారం ఎయిడ్ ఎన్టీఓ ఆధ్వర్యంలో పట్టణంలోనీ పిట్టలవాడ లోగల మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో బాల్ వివాహ ముక్త్ భారత్‌లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాల్య వివాహం జరిగితే జీవితం అక్కడే ఆగిపోతుందని అలా కాకుండా ఉండాలంటే చదువు మధ్యలో ఆపేయవద్దని సూచించారు. అనంతరం ఎన్జీవోకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఇందులో సీడబ్ల్యూసీ కమిటీ సభ్యులు సమీర్ ఉల్లాఖాన్, ఆర్‌ఎల్‌సీ కెప్టెన్ సలీం, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ సతీశ్‌కుమార్, ప్రిన్సిపాల్ ఫారిన్ సుల్తానా, ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కే.వినోద్, కమ్యూనిటీ మొబిలైజర్లు సంపత్, కిరణ్ తదితరులు ఉన్నారు.


