● రోడ్డుమార్గంలోనే హైదరాబాద్‌కు తిరుగుపయనమైన మంత్రి ● ఆదిలాబాద్‌లోనే నిలిచిన హెలికాప్టర్‌ | - | Sakshi
Sakshi News home page

● రోడ్డుమార్గంలోనే హైదరాబాద్‌కు తిరుగుపయనమైన మంత్రి ● ఆదిలాబాద్‌లోనే నిలిచిన హెలికాప్టర్‌

Sep 23 2026 12:13 AM | Updated on Sep 23 2026 12:13 AM

● రోడ్డుమార్గంలోనే హైదరాబాద్‌కు తిరుగుపయనమైన మంత్రి ● ఆదిలాబాద్‌లోనే నిలిచిన హెలికాప్టర్‌

హెలికాప్టర్‌కు ఇంధనం కొరత

కైలాస్‌నగర్‌: మంత్రి రాజనరసింహ పర్యటించిన హెలికాప్టర్‌కు ఇంధనం కొరత ఏర్పడింది. రిమ్స్‌ ఘటన నేపథ్యంలో మంగళవారం ప్రత్యేక హెలి కాప్టర్‌లో మంత్రి చేరుకుని ఆసుపత్రి సందర్శించా రు. అనంతరం హైదరాబాద్‌ బయలుదేరేందుకు జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన కాన్వాయ్‌లో ఎరో డ్రమ్‌కు చేరుకున్నారు. అయితే సరిపడా ఇంధనం లేదని, నాందేడ్‌కు వెళ్లి అక్కడ నింపుకుని తిరిగి హైదరాబాద్‌కు వెళదామని పైలట్లు మంత్రికి తెలిపారు. అంత దూరం ఇష్టం లేక రోడ్డుమార్గం గుండానే వెళ్తానని మంత్రి పేర్కొన్నారు. అనంతరం వాహనంలో హైదరాబాద్‌ బయల్దేరారు. కాగా, జిల్లా యంత్రాంగం ఇంధనం కోసం సిబ్బందిని నాగ్‌పూర్‌కు పంపించింది. సాయంత్రం ఐదు గంటల తర్వాత జిల్లాకు చేరుకుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో హెలి కాప్టర్‌ జిల్లా కేంద్రంలోనే నిలిచిపోయింది. బుధవారం వెళ్లనున్నట్లుగా పైలట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement