ఉట్నూర్‌రూరల్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ అ న్నారు. ఉట్నూర్‌లోని తెలంగాణ ఏకలవ్య ఆద ర్శ గిరిజన గురుకుల పాఠశాలలో ఆదిలాబాద్ జిల్లా క్లస్టర్‌స్థాయి క్రీడాపోటీల విజేతలకు మంగళవారం బహుమతి ప్రదానోత్సవం నిర్వ హించారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయన్నారు. అనంతరం మండల కేంద్రంలోని బోయవాడ, శ్యాంపూర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు.
గిరిజనులకు 75 శాతం అవకాశమివ్వాలి
జీవో 109 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లోని పోలీ స్ నియామకాల్లో స్థానిక గిరిజన యువతకు 75 శాతం అవకాశం కల్పించాలని మంగళవా రం హైదరాబాద్‌లో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క ఆధ్వర్యంలో గిరిజన ఎమ్మెల్యేల బృందం సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సానుకూలంగా స్పందించిన సీఎం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు బొజ్జు పేర్కొన్నారు.


