ఆదిలాబాద్: ఆదివాసీలు, నాయీ బ్రాహ్మణులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే ప రిష్కరించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అ న్నారు. శుక్రవారం శాసనసభలో మాట్లాడు తూ ఆదిలాబాద్ పట్టణంలోని కుమురం భీమ్ కాలనీలో ఏళ్లుగా నివసిస్తున్న ఆదివాసీ కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేర కు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి, వారి నివాసాలకు చట్ట భద్రత క ల్పించాలని డిమాండ్ చేశారు. నాయీ బ్రాహ్మణుల కులవృత్తిపై ఇతర వర్గాల పె త్తనాన్ని అరికట్టి, వారి ఉపాధి, వృత్తి స్వేచ్ఛకు రక్షణ క ల్పించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లకు తగిన గౌరవం, భద్రత, సంక్షేమం కల్పించడంతో పాటు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజా రవాణాలో కీలకంగా పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించి, వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.


