గణేశ్‌ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

గణేశ్‌ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

Sep 19 2026 4:20 AM | Updated on Sep 19 2026 4:20 AM

కైలాస్‌నగర్‌:గణేశ్‌ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంత వా తావరణంలో నిర్వహించేందుకు అన్నిశాఖ లు సమన్వయంతో పనిచేస్తూ పకడ్బందీ ఏర్పాట్లు చేయాల ని కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌తో కలిసి వివిధ శాఖల అధికారులు, ఉత్సవ సమితి ప్రతి ని ధులతో నిమజ్జన ఏర్పాట్లపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రధాన నిమజ్జన ఘాట్లు, భక్తుల రాకపోకలు, ట్రాఫిక్‌ నియంత్రణ, విద్యుత్‌, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యసేవలు, భద్రత వంటి తది తర అంశాలపై శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని ప్రధాన ఘాట్ల వద్ద భారీ క్రేన్లు, విద్యుత్‌ దీపాలు, జనరేటర్లు ఏర్పాటు చేయాలని, అవసరమైన ప్రాంతాల్లో అదనపు లైటింగ్‌ కల్పించా లన్నారు. నీటి ప్రవాహం అధికంగా ఉన్న ప్రాంతా ల్లో గజ ఈతగాళ్లు, లైఫ్‌జాకెట్లు, బోట్లు అందుబా టులో ఉంచాలని ఆదేశించారు. అలాగే ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు అధికారుల కు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చే యాలని కోరారు. ఇందులో అడిషనల్‌ కలెక్టర్‌ ఎస్‌. రాజేశ్వర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అనూష, డీఎస్పీ జీవన్‌రెడ్డి, ఆర్టీవో జగదీశ్వర్‌రావు, పలు శాఖల అధి కారులు పాల్గొన్నారు.

సాత్నాల: భోరజ్‌ మండలం డోలరా సమీపాన గల పెన్‌గంగ తీరంతోపాటు, ఆదిలాబాద్‌ మండలంలో ని చాందా వాగు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్ల ను కలెక్టర్‌, ఎస్పీ శుక్రవారం పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement