గ్రామాల అభివృద్ధికి ముందుకు సాగాలి | - | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధికి ముందుకు సాగాలి

Sep 19 2026 4:20 AM | Updated on Sep 19 2026 4:20 AM

● ఏఐసీసీ సెక్రెటరీ సచిన్‌ సావంత్‌ ● ఆదిలాబాద్‌ నియోజకవర్గ సర్పంచ్‌ల శిక్షణ సమావేశం

ఆదిలాబాద్‌రూరల్‌: గ్రామాల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగాలని ఏఐసీసీ సెక్రెటరీ సచిన్‌ సావంత్‌ అన్నారు. మావల మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఆదిలాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని సర్పంచులకు రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్‌ సంఘటన్‌ శిక్షణ కార్యక్రమానికి శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. గ్రామాల అభివృద్ధిలో స్థానిక సంస్థలు, ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకమన్నారు. గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలన్నారు. ఆర్‌జీపీఆర్‌ఎస్‌ తెలంగాణ ఇన్‌చార్జి, నేషనల్‌ సెక్రెటరీ బి సుభాష్‌ యక్కర మాట్లాడుతూ పంచాయతీరాజ్‌ వ్యవస్థ లక్ష్యాలు, గ్రామస్థాయిలో స్థానిక పాలన ప్రాధాన్యత, సర్పంచులు నిర్వహించాల్సిన బాధ్యతలపై సర్పంచులకు అవగాహన కలిగి ఉండాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ నరేష్‌ జాదవ్‌ మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ జా ఫర్‌, జోనల్‌ కోఆర్డినేటర్‌ నవీన్‌, నేషనల్‌ ట్రైనర్‌ జ్యోత్స్న నాయక్‌, నేషనల్‌ ట్రైనర్‌ సమీనా, మాజీ జీసీసీ చైర్మన్‌ కోట్నాక్‌ తిరుపతి, మాజీ ఎంపీ సోయం బాపురావు, ఆదిలాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూష, ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, బోథ్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్‌, నాయకులు గండ్రత్‌ సుజాత, సాజిద్‌ ఖాన్‌, సంజీవ్‌రెడ్డి, భోజారెడ్డి, తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement