బజార్‌హత్నూర్: పత్తి పంటలో పురుగుల మందు పిచికారీ చేస్తూ మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురైన రైతు రాథోడ్ ఈశ్వర్ (48) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గంగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీనాయక్‌తాండ గ్రామానికి చెందిన ఈశ్వర్ తన పత్తి చేనులో పురుగుల మందు పిచికారీ చేస్తుండగా అస్వస్థతకు గురికావడంతో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు.


