సాత్నాల: వినూత్న బోధన పద్ధతులతో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్న భోరజ్ మండలం పిప్పర్‌వాడ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు పైడి నవనీ త ఫిన్లాండ్ పర్యటనకు ఎంపికయ్యారు. ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఈమెను ఎంపిక చేస్తూ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. పర్యటనలో భాగంగా ఫిన్లాండ్‌లో అమలవుతు న్న విద్యా విధానం, ఆధునిక బోధన పద్ధతుల పై అధ్యయనం చేయనున్నారు. ఈమె ఎంపిక పై తోటి ఉపాధ్యాయులు హర్షంవ్యక్తం చేశారు.


