42 శాతం రిజర్వేషన్‌ కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

42 శాతం రిజర్వేషన్‌ కల్పించాలి

Sep 12 2026 12:00 AM | Updated on Sep 12 2026 12:00 AM

కై లాస్‌నగర్‌: జాతీయ జనగణనలో బీసీల లెక్క తేల్చి, జనాభా మేరకు రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు డిమాండ్‌ చేశారు. సంఘం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట బీసీ ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యా ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు న్యాయమైన 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా, పార్లమెంట్‌లో రాజ్యంగ సరవణ చేపట్టి 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్లు సాధించే వరకు బీసీల ఐక్య ఉద్యమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. వివిధ కుల సంఘాలు మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నాయి. అనంతరం అదనపు కలెక్టర్‌ ఆర్‌ఎస్‌.చిత్రును కలిసి వినతిపత్రం అందజేశారు. దీక్షకు మాజీ మంత్రి జోగు రామన్న సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్‌, నాయకులు మేకల అశోక్‌, సత్యనారాయణ, శ్రీనివాస్‌, విఠల్‌, చందు, నర్సాగౌడ్‌, దశరత్‌, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement