ఆదిలాబాద్: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని యు నైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ నా యకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం బ్యాంకు ఉద్యోగులు ఒకరోజు సమ్మె చేపట్టారు. ఆదిలాబాద్ శివా జీచౌక్‌లోని ఎస్‌బీఐ ఆవరణలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ చౌక్‌లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫోరం రీజనల్ సెక్రెటరీ సురేందర్ మాట్లాడుతూ, ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 28 నుంచి మూడు రోజుల సమ్మె చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పరమేశ్వర్, అనికేత్ జాదవ్, వినయ్‌కుమార్, బాషా, రమేశ్, పృథ్వీకుమార్, శ్రీకాంత్‌రెడ్డి, బాలకృష్ణ, సంతోష్ పాల్గొన్నారు.


