ఆదిలాబాద్: ఆదిలా బాద్‌కు ఐటీ పరిశ్రమలను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహక విధానం ప్రకటించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శాసనసభలో శుక్రవారం మా ట్లాడుతూ జిల్లాలో ఐటీ రంగ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరా రు. కేవలం టవర్ నిర్మి స్తే కంపెనీలు రావని, వా టిని ఆకర్షించేందుకు సబ్సిడీలు, రాయితీ క్లౌడ్ డేటా వంటి ప్రోత్సాహకాలు అందించాలన్నారు. ఆదిలాబాద్‌లో డేటా సెంటర్ ఏర్పా టు చేయాలని, ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను నెలకొల్పాలని కోరారు. హైదరాబాద్‌కు దూరంగా ఉన్న ఆదిలాబాద్ వంటి ప్రాంతా లకు ప్రత్యేక ఇన్సెంటివ్ పాలసీ అమలు చేస్తే ఐటీ సంస్థలు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. తద్వారా స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధితోపాటు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.


